మే నెలాఖరులోగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తి

0
23

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను మే నెలాఖరులోగా పూర్తిచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో పూర్తిచేసుకున్న తొలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, మంత్రి చందూలాల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దల పద్మ, ఎంపీలు దయాకర్‌, సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ హాజరయ్యారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారన్నారు. వాటిని నియోజకవర్గ దేవాలయాలుగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 చోట్ల భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, తొలిసారిగా పరకాలలో పనులు పూర్తయి ప్రారంభంకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారంటూ ఆయనను అభినందించారు. సీఎం కేసీఆర్‌ అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతం కంటె ఎక్కువ గౌరవం ఇచ్చారనీ, అందుకే ‘టీచర్‌’ అనే పదం చేర్చామన్నారు. హామీ ఇచ్చినరోజే వేతనాలను పెంచుతూ జీవో ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ ఆకాంక్షలకు తగ్గట్టుగా టీచర్లు, ఆయాలు పనిచేయాలని మంత్రి కోరారు. తన వద్ద ఉన్న మహిళా, శిశు సంక్షేమశాఖను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి బదలాయించే అవకాశాలున్నాయని, ఇక నుంచి ఆయన పరిధిలోనే మీరంతా పనిచేయాల్సి ఉంటుందని నాలుగు మండలాల నుంచి వచ్చిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలనుద్దేశించి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here