మేఘాలయ గవర్నర్ రాజీనామా

0
16

మేఘాలయ గవర్నర్ వీ షణ్ముగనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. 100 మంది రాజ్‌భవన్ ఉద్యోగులు గవర్నర్ నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మో దీ, హోంమంత్రి రాజ్‌నాథ్, రాష్ట్రపతి ప్రణ బ్‌ముఖర్జీకి లేఖ రాసిన కొన్ని గంటల్లో ఈ ప్రకటన వెలువడింది. ఇందులో గవర్నర్‌పై 11 ఆరోపణలు చేసినట్లు సమాచారం. మేఘాలయ గవర్నర్ వీ షణ్ముగనాథన్ రాజ్‌భవన్ పరువు ప్రతిష్ఠలను మంటగలుపుతున్నారని, యువతుల క్లబ్‌గా మార్చారని ఆరోపించారు. షణ్ముగనాథన్ అబద్ధాలకోరనీ, అసభ్యంగా, క్రూరంగా వ్యవహరిస్తున్నారని, అకారణంగా ఉన్నతాధికారులను తొలగిస్తున్నారన్నారు. ఆయన అవమానించడంతో మాజీ డిప్యూటీ కార్యదర్శి ఒకరు గుండెపోటుతో చనిపోయారని ఆరోపించారు. పీఆర్వో ఉగ్యోగం కోసం వచ్చిన ఒక యువతితో షణ్ముగనాథన్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆరెస్సెస్ నాయకుడైన షణ్ముగనాథన్‌ను కేంద్రం 2015లో మేలో మేఘాలయ గవర్నర్‌గా నియమించింది. ఉద్యోగులు ప్రధానికి లేఖ రాసిన విషయం నిజమే కానీ, వివరాలు తెలియవని గవర్నర్ కార్యదర్శి లకియాంగ్ చెప్పారు.

 

LEAVE A REPLY