మేఘాలయ గవర్నర్ రాజీనామా ఆమోదం

0
23

మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ వీ షణ్ముగనాథన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. మేఘాలయలోని రాజ్‌భవన్‌ను షణ్ముగనాథన్ అమ్మాయిల క్లబ్‌గా మార్చారని ఆరోపిస్తూ రాజ్‌భవన్ ఉద్యోగులు రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీంతో షణ్ముగనాథన్ గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. అసోం గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్‌కు మేఘాలయ బాధ్యతలను, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యకు అరుణాచల్‌ప్రదేశ్ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

షణ్ముగనాథన్ లీలలు

షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్ ఉద్యోగులు రాష్ట్రపతికి, ప్రధానికి రాసిన లేఖలో షణ్ముగనాథన్‌ను లీలలను వివరంగా పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను షణ్ముగనాథన్ అమ్మాయిల క్లబ్బుగా మార్చివేశారు. గవర్నర్ ప్రత్యక్ష ఆదేశాలతో అమ్మాయిలు ఎప్పుడంటే అప్పుడు రాజ్‌భవన్‌లోని ఆయన పడకగదికి వచ్చిపోతున్నారు. గవర్నర్‌కు సంబంధించిన సిబ్బందిలో అన్ని పోస్టులను మహిళలతోనే నింపివేశారు. రాజ్‌భవన్ ప్రతిష్ఠను, ఉద్యోగుల భావోద్వేగాలను ఆయన కాలరాశారు. గవర్నర్ అవమానించటంతో డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై మరణించారు అని వారు వాపోయారు. ఈ లేఖపై 80 మందికిపైగా ఉద్యోగులు సంతకాలు చేయటం విశేషం. మరోవైపు, షణ్ముగనాథన్ సాగించిన అనైతిక వ్యవహారాలను స్థానిక మీడియా కూడా బయటపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here