మేం గెలిస్తే.. సీఎం, మంత్రులు జైలుకే!

0
24

పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్‌సింగ్ విరుచుకుపడ్డారు. బాదల్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, ప్రత్యేక అధికారులు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేశారు. వారెవ్వరినీ వదలం. అందరినీ జైల్లో పెడుతాం అని అన్నారు. పన్‌జ్వాన్, సరావన్ బోడ్లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బాదల్ ప్రభుత్వం రాష్ట్రంలో తీవ్ర అక్రమాలకు పాల్పడిందన్నారు. పంజాబ్ ప్రజల అభివృద్ధిలో కేజ్రీవాల్‌కు చిత్తశుద్ధి లేదని, నేరారోపణలపై ఆయన సొంత ఎమ్మెల్యేలే జైల్లో ఉన్నారన్నారు. తన బావతోపాటు ఆయన కూడా అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY