మెరీనా మంటలు బయటివారి పనేనా?

0
32

జల్లికట్టు నిరసనకారులు బైఠాయింపు జరిపిన మెరీనాబీచ్ అగ్నిగుండంగా ఎందుకు మారింది? చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి? అక్కడ చేరినవారంతా నిరసనకారులేనా? లేక బయటిశక్తులు దూరాయా? జల్లికట్టు ఆర్డినెన్స్ స్థానంలో తమిళనాడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిరసనకారులు ఇండ్లకు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమైన తర్వాత గొడవ మొదలైంది. నిరసనకారుల్లో చేరిపోయిన అల్లరిమూకలు హింసాకాండకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని పోలీసులు అంటున్నారు. కొందరు పోలీసులే వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం పోలీసులకు ఇబ్బందికరంగా తయారైంది. కొందరు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు శాంతియుతంగానే వ్యవహరించారని, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులే అల్లర్లు మొదలుపెట్టారని అంటున్నారు. తాము వెనుకకు తిరిగి వెళ్లిపోయేందుకు 4 గంటల సమయం కావాలని నిరసనకారులు అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here