మెట్రో రైలు ముందు దూకిన సివిల్‌ సర్వీసు విద్యార్థి

0
18

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్‌ బాగ్‌ మెట్రో స్టేషన్‌లో ఈరోజు ఉదయం ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here