మెట్రోరైల్లో ఇంటికి

0
14

తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు రేపుతున్న జల్లికట్టు నిరసన సెగ భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తాకింది. నిరసనల కారణంగా గత కొన్ని రోజుల నుంచి చెన్నై నగరం ఆందోళనకరంగా తయారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సొంతనగరం చెన్నైకి సోమవారం చేరుకున్న అశ్విన్..ఇంటికి బయల్దేరడానికి మెట్రోను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. యువకులందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు పాల్పడుతుండటంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్న పరిస్థితుల్లో సొంతకారుకు బదులుగా అశ్విన్ మెట్రోలో ప్రయాణించాడు. కొన్ని పరిస్థితులు ప్రజారవాణా అవసరాన్ని బాగా గుర్తుకు తెస్తాయి. ఈ విషయంలో నన్ను సురక్షితంగా గమ్యానికి చేర్చిన ఎయిర్‌పోర్ట్ పోలీసులకు కృతజ్ఞతలు అని అశ్విన్ తన ట్విట్టర్‌లో ఫొటోతో సహా పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY