మెగా.. జోష్.. అదే మాస్‌… అదే క్రేజ్‌

0
23

అదే మాస్‌… అదే క్రేజ్‌, అదే జోరు.. అదే హోరు. సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ కార్యక్రమం శనివారం సాయంత్రం అమరావతి రాజధానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఉత్సాహభరితంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులంతా హాజరై కార్యక్రమానికి నిండుతనం తీసుకొచ్చారు. గుంటూరు, విజయవాడ, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది చిరు అభిమానులు భారీగా తరలివచ్చారు. వాహనాలతో చినకాకాని వద్ద జాతీయ రహదారి కిక్కిరిసింది. ప్రాంగణం సరిపోకపోవడంతో చాలామంది సాయంత్రానికే వెనుదిరిగారు. మూవీ ట్రైలర్‌ను చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు.

LEAVE A REPLY