మెగాస్టార్ మెగా రికార్డ్

0
14

రీ ఎంట్రీలో మెగాస్టార్ రికార్డ్ల హవా కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ వందకోట్ల కలెక్షన్లతో సత్తా చాటాడు. ఈ జనరేషన్ హీరోలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ కలెక్షన్ రికార్డ్లను సైతం మెగాస్టార్ ఈజీగా అందుకున్నాడు.

సౌత్‌లో వందకోట్ల సినిమాలు గతంలోనూ ఉన్నా.., చిరంజీవి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు సౌత్‌లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నా, అవన్ని రెండు, మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయి ఆ రికార్డ్‌ను సాధించాయి.. కానీ కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here