మెక్సికోలోని పటాకుల మార్కెట్లో అగ్నిప్రమాదం

0
17

మెక్సికోలోని పటాకుల మార్కెట్లో బుధవారం ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పేలుళ్లు సంభవించడంతో 31 మంది చనిపోగా, 72 మంది గాయపడ్డారు. మెక్సికో నగర శివారులోని తుల్తెపెక్‌లో ఈ పటాకుల మార్కెట్ ఉన్నది. పటాకులకు మంటలు అంటుకోవడంతో పేలుళ్లు జరిగాయి. రకరకాల బాణసంచా పేలడంతో రంగురంగుల వెలుగులు, మంటలతో దట్టమైన పొగలు లేచి మెక్సికో నగరం వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగినపుడు పటాకుల మార్కెట్లో చాలామంది ఉన్నారు. క్రిస్‌మస్ పండుగ, త్వరలో కొత్త సంవత్సర వేడుకల కోసం పటాకులు కొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలతో మార్కెట్ సందడిగా ఉన్నపుడు అకస్మాత్తుగా పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు మార్కెట్లో ఉన్న వారు పిల్లలతో సహా పరుగుపరుగున బయటకు వచ్చారని, అప్పటికే వారికి మంటలు అంటుకున్నాయని వాల్టర్ గర్దునో అనే వ్యక్తి చెప్పాడు.

LEAVE A REPLY