మూసీకి పోటెత్తిన వరద

0
11

 ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా మూసీ రిజర్వాయర్‌లోకి మంగళవారం ఉదయం ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ నీటిమట్టం 645 అడుగుల పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో, ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో నీటిమట్టాన్ని తగ్గించాలని నిర్ణయించారు.  దీంతో మంగళవారం ఉదయం 2, 3, 4, 7, 8, 10వ నంబర్‌ క్రస్ట్‌ గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 12,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 250 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 643 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 4.4 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో 4.3 టీఎంసీల నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY