మూసీకిరు వైపులా రహదారులు

0
22

ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో మూసీనదికి ఇరువైపులా రహదారులు నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూసీ నది మధ్యనుంచి నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ ఈస్ట్-వెస్ట్ కారిడార్ పేరుతో భారీ స్కైవే నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధంచేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.5916 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగురోడ్డు అవతల బాచారం గ్రామం నుంచి పశ్చిమాన నార్సింగి వరకు సుమారు 41 కిలోమీటర్ల పొడవునా దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో భూసేకరణ కోసం రూ.754 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే స్కైవే నిర్మాణానికి కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY