మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి

0
15

సొంతగడ్డపై వరుస విజయాల జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్‌ను మొహాలీలో కోహ్లీసేన మట్టికరిపించింది. అటు బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ అదరగొడుతూ భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, జయంత్‌కు తోడు షమీ కూడా రాణించడంతో గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. ఎనిమిదేండ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చిన పార్థివ్ పటేల్ దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమ్‌ఇండియా అలవోకగా అందుకుంది. మరోరోజు మిగిలుండగానే మొహాలీ టెస్ట్‌ను ముగించిన భారత్ ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

LEAVE A REPLY