మూడేండ్ల ప్రణాళిక విధానం అమలుకు రంగం సిద్ధం

0
26

తొలి ప్రధాని నెహ్రూ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళిక స్థానే మూడేండ్ల ప్రణాళిక విధానం అమలులోకి రానున్నదా?.. దీనిపై ఈ నెల 23న జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ సమావేశం చర్చించనుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. 2014లో ప్రణాళిక సంఘం స్థానే నీతి ఆయోగ్ అనే వ్యవస్థకు ప్రాణం పోసిన ప్రధా ని మోదీ.. తాజాగా పంచవర్ష ప్రణాళికను రద్దుచేసే దిశగా యోచిస్తున్నారు. నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని మోదీ అధ్యక్షతన వచ్చే ఆదివారం జరిగే సమావేశంలో అన్నిరాష్ర్టాల సీఎంలు పాల్గొంటారు. విజన్ – స్ట్రాటజీ – యాక్షన్ ప్లాన్, జీఎస్టీ స్వరూపం, డిజిటల్ ఇండియా, రైతుల ఆదాయం రెట్టింపు అనే అంశాలతో కూడిన ఎజెండాపై చర్చ జరుగనున్నది. కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన మూడేండ్లలో సాధించిన ప్రగతిపైనా సమీక్షిస్తారు.

LEAVE A REPLY