మూడు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

0
21

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోటార్మూర్ శివారులో 44వ జాతీయరహదారిపై మూడు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న భారీ కంటెయినర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. లారీ వెనుక భాగం దెబ్బతిని డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కంటెయినర్ వాహనం నడుపుతున్న డ్రైవర్ కాళ్లకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి నిర్మాణసంస్థ నవయుగ కంపెనీ పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. కంటెయినర్, లారీ మధ్యలోకి పెట్రోలింగ్ వాహనడ్రైవర్ మహ్మద్ జావీద్(35) వెళ్లి పరిశీలిస్తుండగా మరో కంటెయినర్ వచ్చి ఈ కంటెయినర్‌ను ఢీ కొట్టింది. రెండింటి మధ్య ఇరుక్కుపోయి జావీద్ మృతిచెందాడు. మరో కంటెయినర్ క్లీనర్ వివేక్(30) అక్కడికక్కడే మృతిచెందాడు

LEAVE A REPLY