మూడురోజులు…మిలియన్ డాలర్!

0
23

ధృవ సినిమా గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడటం ఆనందంగా ఉంది. యుఎస్‌ఏలో కేవలం మూడు రోజుల్లోనే మిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది. అన్ని కేంద్రాల్లో హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది అని తెలిపారు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీప్రసాద్ నిర్మించారు. ఇటీవలేఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ యుఎస్‌ఏ ప్రేక్షకులను ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాను. అది ధృవ సినిమాతో నెరవేరింది. యుఎస్‌ఏలో సినిమా చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో అభిమానులతో చిత్ర విజయాన్ని పంచుకుంటాను అని తెలిపారు. సినిమా బాగుంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారడానికి ఈ చిత్రమే నిదర్శనమని, మంచి సినిమాగా అందరిని మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.

LEAVE A REPLY