ముహూర్తం కుదిరింది

0
27

అఖిల్ తాజా చిత్రంపై గత కొన్ని నెలలుగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యువ హీరో నటించనున్న కొత్త చిత్రం ఎట్టకేలకు జనవరి 4న పట్టాలెక్కబోతుంది. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. టబు కీలక పాత్రలో నటించనుండగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా తమిళ నటి మేఘా ఆకాష్ నటించనుంది. ఈమె పస్తుతం తమిళంలో రూపొందుతున్న ఎనై నోకి పాయుమ్ తోట, ఒరు పక్కా కథై చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here