ముస్లింల ద్రోహి చంద్రబాబు :ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా

0
7

నాలుగేళ్లుగా ముస్లింలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు ముస్లింలు తనకు అండగా నిలవాలని చెప్పడం దారుణంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా విమర్శించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మోసం చేసిందని, ఇది ముస్లింలు తమకు బాసటగా నిలవాల్సిన సమయం అని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. కష్టాల్లో ఉన్నపుడే ఆయనకు ముస్లింలు గుర్తుకు వస్తారా? అని ముస్తఫా ప్రశ్నించారు. అసలు ముస్లింలకు ఏం చేశారని చంద్రబాబుకు తాము అండగా నిలవాలో చెప్పాలని రాష్ట్రంలోని ముస్లింలు అంతా ప్రశ్నిస్తున్నారన్నారు.

LEAVE A REPLY