మురుగదాస్ దర్శకత్వంలో

0
23

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సంభవామీ ( టైటిల్ పరిశీలనలో వుంది) చిత్రంలో నటిస్తున్నారు మహేష్‌బాబు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఈ రెండు ప్రాజెక్ట్స్ అనంతరం వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు ఓ సినిమాకు అంగీకరించారు. ఆయనకిది 25వ చిత్రం కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు వంశీపైడిపల్లి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేయబోతుండటం ఆనందంగా వుందని, ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తారని వంశీపైడిపల్లి పేర్కొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here