ముద్రగడ పోరాట యోధుడు:మోహన్‌బాబు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోరాట యోధుడని సినీ నటుడు మోహన్‌బాబు ప్రశంసించారు. కాపుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఇందులో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ముద్రగడ కుటుంబంతో మోహన్‌బాబు సతీసమేతంగా సమావేశమయ్యారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడకుండా నిర్మొహమాటంగా మాట్లాడే ముద్రగడ నైజం తనకెంతో నచ్చిందని, ముద్రగడకు తాను అభిమానినని చెప్పారు. అంతకుముందు… హైదరాబాద్‌ నుంచి జెట్‌ విమానంలో ఉదయం 11 గంటలకు భార్య నిర్మలతో కలసి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మోహన్‌బాబు… అక్కడి నుంచి ముద్రగడ పంపిన వాహనంలో నేరుగా కిర్లంపూడి వెళ్లారు. తమ స్వగృహానికి చేరుకున్న మోహన్‌బాబు దంపతులకు ముద్రగడ కుటుంబీకులు స్వాగతం పలికారు. గంటపాటు వారు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులను మోహన్‌బాబుకు ముద్రగడ పరిచయం చేశారు. అనంతరం మోహన్‌బాబు దంపతులను కారులో ఎక్కించి గేటు వరకూ వచ్చి ముద్రగడ వీడ్కోలు పలికారు.

0
36

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోరాట యోధుడని సినీ నటుడు మోహన్‌బాబు ప్రశంసించారు. కాపుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఇందులో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ముద్రగడ కుటుంబంతో మోహన్‌బాబు సతీసమేతంగా సమావేశమయ్యారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడకుండా నిర్మొహమాటంగా మాట్లాడే ముద్రగడ నైజం తనకెంతో నచ్చిందని, ముద్రగడకు తాను అభిమానినని చెప్పారు. అంతకుముందు… హైదరాబాద్‌ నుంచి జెట్‌ విమానంలో ఉదయం 11 గంటలకు భార్య నిర్మలతో కలసి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మోహన్‌బాబు… అక్కడి నుంచి ముద్రగడ పంపిన వాహనంలో నేరుగా కిర్లంపూడి వెళ్లారు. తమ స్వగృహానికి చేరుకున్న మోహన్‌బాబు దంపతులకు ముద్రగడ కుటుంబీకులు స్వాగతం పలికారు. గంటపాటు వారు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులను మోహన్‌బాబుకు ముద్రగడ పరిచయం చేశారు. అనంతరం మోహన్‌బాబు దంపతులను కారులో ఎక్కించి గేటు వరకూ వచ్చి ముద్రగడ వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY