ముదిరాజ్‌ల సభలో డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ

0
22

తెలంగాణ:రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ చెప్పారు. ఆదివారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో జరిగిన సింహగర్జన సభలో వారు మాట్లాడుతూ విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుతో ముదిరాజ్‌లు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమాజంలో 10% జనాభాగల ముదిరాజ్‌లకు సమన్యాయం జరుగాలని వారు ఆకాంక్షించారు. బీసీల్లోని అన్ని కులాలకు న్యాయం చేసేందుకే సీఎం కే చంద్రశేఖర్‌రావు బీసీ కమిషన్ ఏర్పాటుచేశారని చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి ఏ గ్రూప్‌లోకి మార్చాలన్న డిమాండ్‌ను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ హామీనిచ్చారు.

LEAVE A REPLY