ముత్తూట్ దొంగలు దొరికారు

0
57

ఢిల్లీ నుంచి వచ్చి న సీబీఐ అధికారులమంటూ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పట్టపగలు ఘరానా దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా దొరికింది. హైదరాబాద్ నగర శివారులోని రామచంద్రపురం ముత్తూట్ ఫైనాన్స్‌లో డిసెంబర్ 28 ఉదయ మే జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. మాఫియాతో లింక్స్ ఉన్న ఈ గ్యాంగ్ చేసిన నాలుగు దోపిడీ కేసు ల మిస్టరీని ఛేదించారు. ఈ ముఠా రామచంద్రపురంలో 41.8 కేజీల బంగారం, 91 వేల నగదును చోరీచేయగా, మొత్తం నాలుగు కేసుల్లో 58 కేజీల బంగారాన్ని దోచుకున్నట్లు వెల్లడయింది. ప్రస్తుతం పోలీసులు మూడున్నర కేజీ ల బంగారంతోపాటు ఐదు లక్షల నగదును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య ఆదివారం మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 28వ తేదీన రామచంద్రపురం ముత్తూట్ ఫైనా న్స్ సంస్థ కార్యాలయంలోకి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సుగల ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ సిబ్బందిమంటూ పరిచయం చేసుకున్నారు. నల్లధనం ఉన్నదని బెదిరించి.. లాకర్ తెరిపించా రు. బంగారాన్ని మొత్తం సంచుల్లో నింపుకొని.. ఆ తర్వాత సీసీటీవీ రికార్డులుండే రెండు డీవీఆర్లను తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 41.8 కేజీల బంగారం, 91 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీసీటీవీల్లో రికార్డయిన వాహనాల ఆధారంగా దర్యాప్తును సాగించామని సీపీ చెప్పారు. శనివారం లక్ష్మణ్, విజయ్, పాటిల్‌లను, ఆదివారం సుభా ష్, కుమార్‌పాల్ షా (రిసీవర్)లను అరెస్టు చేశాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here