ముగ్గురి ప్రాణాలు బలి

0
33

గద్వాల జిల్లాకేంద్రంలోని బృందావన్‌ కాలనీకి చెందిన తెలుగు రాజేష్‌ను నాగర్‌కర్నూల్‌కు చెందిన సునిత (27)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు అమృత(5), వైష్ణవి(3) ఉన్నారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణీ. ఎంతో అన్యోన్యంగా సాగే వీరి సంసారంలో ఇటీవలే చిన్నచిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి పిల్లల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సునిత మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా పిల్లలను వెంట పెట్టుకొని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుంచి భార్యా పిల్లలు కన్పించక పోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకాబు చేసినా ఆచూకి లభించలేదు.

LEAVE A REPLY