ముగ్గురిని మింగిన పాడు ఇల్లు

0
24

పేట్‌బషీరాబాద్:పాడుబడిన ఇల్లు కూల్చివేతలో అపశృతి చోటుచేసుకుంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇంటి యజమాని చేసిన తప్పిదం వల్ల మూడు కుటుంబాలు రోడున పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, దవాఖానకు తరలిస్తుండగా మరో ఇద్దరు మృతిచెందారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలో శ్రీనివాస్‌గుప్త అనే వ్యక్తి మూడు దశాబ్దాల క్రితం కట్టిన ఇంటిని కూల్చి నూతన ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాడు. కూల్చివేతకు ఏడుగురు కూలీలను మాట్లాడాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోచంపల్లి గ్రామానికి చెందిన తుమ్మల లక్ష్మణ్(48), ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉప్పిపాడు గ్రామానికి చెందిన ఆచంట వెంకటేశ్వర్లు(40), విశాఖపట్నం జిల్లా మాడుగుళ్ల మండలం వీరనారాయణ గ్రా మానికి చెందిన ముత్యాలనాయుడు(55) గురువారం ఉదయం పనికి వచ్చారు.

LEAVE A REPLY