ముగ్గురితో డ్యాన్స్ డ్యాన్స్‌

0
31

టాలీవుడ్‌లో ప్రస్తుత తరంలో బెస్ట్‌ డ్యాన్సర్స్‌ ఎవరు అంటే టక్కున చెప్పేపేర్లు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రాంచరణ్‌. మెగాస్టార్‌ చిరంజీవి తరువాత నృత్యానికి ఆ స్థాయిలో క్రేజ్‌ తెచ్చింది ఈ ముగ్గురే. వీరిలో తమ హీరో గొప్పంటే తమవాడు గొప్పని అభిమానుల మధ్య ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉన్నా .. ఈ ముగ్గురు ఎవరికి వారే ప్రత్యేకం. విద్యుత్‌ వేగంతో తనదైన ఎనర్జీతో స్టెప్స్‌ వేస్తూ మాస్‌ని అలరించడంతో తారక్‌ దిట్ట. ఇటు వెస్ట్రన్‌ మూవ్స్‌తో పాటు అటు మాస్‌బీట్‌తో అభిమానులతో ఈలలు వేయించడంతో బన్నీది ప్రత్యేక శైలి. ఇక మెగాస్టార్‌ వారసుడిగా నృత్యంలో మంచి ఈజ్‌ ప్రదర్శిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు చరణ్‌. అందుకే వీరిపక్కన నృత్యం చేయాలంటే కొంచెం కష్టమేనని కథానాయికలు చెప్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు డ్యాన్సింగ్‌ కింగ్స్‌తో జతకట్టిన క్వీన్‌గా రకుల్‌ప్రీత్‌ నిలిచిపోయింది. తారక్‌తో ‘నాన్నకుప్రేమతో’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చరణ్‌తో ‘ధ్రువ’ సినిమాల్లో ఆడిపాడింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించడంతో రకుల్‌కి ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు. మరోవైపు ఈ ముగ్గురితో నృత్యం చేయడం వల్ల తన డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అద్భుతంగా పెరిగాయని ఒకానొక సందర్భంలో చెప్పిన రకుల్‌ వారి నుంచి నటనలోనూ ఎంతో నేర్చుకున్నానని చెప్పింది.

LEAVE A REPLY