ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణలోకి

0
23

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ గురువారం కూడా దూకుడు ప్రదర్శించారు. రాష్ట్ర రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న మినీసెల్స్, లాకప్ సదుపాయాలతోపాటు రికార్డులను పరిశీలించారు. ఇక మీదట కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు.. విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలపై 100మందికిపైగా పోలీసులు సస్పెన్షన్‌కు గురైనట్లుగా యూపీ పోలీస్ ప్రజాసంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది కానిస్టేబుళ్లు ఉన్నారని చెప్పారు. ఘజియాబాద్, మీరట్, నోయిడా, లక్నో ప్రాంతాలకు చెందిన పోలీసులపైనే ఎక్కువగా వేటు పడినట్లు తెలుస్తున్నది.

LEAVE A REPLY