ముంబైని ముంచెత్తతున్న వానలు

0
9

రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లోజోరువానలు కురుస్తున్నాయ్. మహారాష్ట్ర, ముంబైలో వర్షాలు కుమ్మేస్తున్నాయ్. చిన్న చినుకు పడితేనే చిత్తడయ్యే ముంబై మహానగరం.. భారీ వర్షాలకు వణికిపోతోంది. వరదనీరు వచ్చి చేరడంతో ముంబైలో ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనాల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

నాలుగు రోజులుగా ముంబైలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. థానే, పరేల్, ధరావి, కింగ్స్ సర్కిల్, మాతుంగా, దివాతో పాటూ చాలా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లోకి కూడా నీళ్లు చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లు చెరువులుగా మారిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముంబైలోని కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది.

LEAVE A REPLY