ముంబయిలో ముగించేస్తారా!

0
22

విపరీతంగా తిరిగే పిచ్‌లనేమీ తయారు చేసుకోకున్నా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, గత రెండు టెస్టుల్లో గెలిచిన కోహ్లిసేన సిరీస్‌పై కన్నేసింది. అదే జోరుతో ముంబయిలోనే ఇంగ్లాండ్‌ కథ ముగించాలనుకుంటోంది. గురువారం నుంచే వాంఖడేలో నాలుగో టెస్టు. రెండు వరుస విజయాలతో జోరుమీదున్నప్పటికీ భారత్‌ను గాయాల బెడద పట్టుకుంది. గాయంతో రహానె దూరం కావడం, షమిపై అనిశ్చితి నెలకొనడం ప్రతికూలతలే. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన స్థితిలో ఇంగ్లిష్‌ జట్టు పోరాటానికి పట్టుదలగా సిద్ధమవుతోంది.

LEAVE A REPLY