ముందే వచ్చేస్తాడు

0
16

వన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. శ్రుతిహాసన్‌ కథానాయిక. కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నాయకానాయికలతో పాటు ఇతర ప్రధాన తారాగణం చిత్రీకరణలో పాల్గొంటోంది. మార్చి 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు నిర్మాత. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇంతకుముందు నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తవనున్నట్టు సమాచారం. విదేశాల్లో చిత్రీకరించనున్న ఆ రెండు పాటలు పూర్తయితే ఇక సినిమా విడుదలకి సిద్ధమైనట్టే. సంక్రాంతి సందర్భంగా ‘కాటమరాయుడు’ ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. వాటిలో పవన్‌కల్యాణ్‌ పంచెకట్టుతో కనిపించి అలరించారు. చిత్రంలో ఆయన నలుగురు తమ్ముళ్లకి అన్నగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

LEAVE A REPLY