మీడియా ముందుకొస్తున్న ట్రంప్

0
19

చికాగో వేదికగా అమెరికా అధ్యక్షుడిగా దిగిపోనున్న బరాక్ ఒబామా ఫేర్ వెల్ స్పీచ్ ఇచ్చిన మరుసటి రోజే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇన్ని రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఊరించిన ట్రంప్ ఎట్టకేలకు మీడియా ముందుకొస్తున్నట్టు తెలిసింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నేడు తొలి మీడియా సమావేశం నిర్వహించనున్నారని, తన వ్యాపార బదిలీ నిర్వహణ నుంచి దేశం వైపు ఎలా దృష్టి మరలుస్తాడనే విషయంపై ట్రంప్ క్లారిటీ ఇ‍వ్వనున్నారని ఇన్కమింగ్ వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ తెలిపారు. అమెరికా వృద్ధి కోసమే అమెరికన్లు పనిచేసే సమయం ఆసన్నమైందని తెలుపుతూ ట్రంప్ మీడియా సమావేశాన్ని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.

LEAVE A REPLY