మిస్టర్..పర్‌ఫెక్ట్

0
30

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్. శ్రీను వైట్ల దర్శకుడు. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా కనిపించే ఓ యువకుడి కథ ఇది. వినోదంతో పాటు చక్కటి భావోద్వేగాలతో సాగిపోతుంది. వరుణ్‌తేజ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. స్పెయిన్‌తో పాటు ఇండియాలోని చిక్‌మంగళూర్, చాళకుడి, ఊటీ, హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. మిక్కి జె మేయర్ ఆరు అద్భుతమైన పాటల్ని అందించారు అన్నారు. ప్రిన్స్, నాజర్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, మాటలు: శ్రీధర్ సీపాన, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: మిక్కి జె మేయర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here