మిర్చి రైతుకు దన్ను ,రేపటి నుంచి క్వింటాలుకు అదనంగా రూ.1500 ఒక్కో రైతుకు 20 క్వింటాళ్లకు పరిహారం

0
26

మిర్చి రైతును ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు మార్కెట్‌లో విక్రయించే ధరకు అదనంగా మరో రూ.1,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చేయాలని నిర్ణయించింది. గురువారం (20వ తేదీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 20 క్వింటాళ్లకు రూ.30 వేల పరిహారం అందనుంది. అయితే మార్కెట్లో రైతు విక్రయించిన మిర్చి ధరకు ప్రభుత్వం ఇచ్చే రూ.1,500 జోడిస్తే క్వింటాలు ధర రూ.8 వేలు దాటకూడదన్న నిబంధన విధించడంతో రైతులు మండిపడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటాలు మిర్చిని రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం గుంటూరు జిల్లా పెదనందిపాడులో కౌలు రైతులు గుంటూరు-పరుచూరు రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రకాశం జిల్లాలో మిర్చిని రోడ్డుపై పోసి నిప్పంటించారు.

LEAVE A REPLY