మిమిక్రీ సమ్రాట్ మహాప్రస్థానం

0
22

పద్మశ్రీ, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ (86) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల.. మంగళవారం ఉదయం అస్తమించారు. ఓరుగల్లు పురవీధుల్లో మొదలైన ఆయన స్వరవిహారం విజయవిహారమై.. ఇదే నగరం నుంచి విశ్వాంతరాళాల్లోకి పయన మైంది. వరంగల్‌లోని మట్టెవాడలో 1932 డిసెంబర్ 28న జన్మించిన నేరెళ్ల వేణుమాధవ్.. తన పదిహేనవ ఏట నుంచి చనిపోవడానికి కొద్దిరోజుల ముందు వరకు కళాప్రదర్శనల్లో కలియతిరిగారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారం అందించి గౌరవించుకుంది. డాక్టర్ నేరెళ్లకు భార్య శోభావతి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. మిమిక్రీ కళారంగంలో ఎవరెస్టు శిఖరమంత ఎదిగినా ఏకశిలా నగరాన్ని ఆయన వీడి వెళ్లలేదు. కాళోజీ నారాయణరావు, బుర్రా రాములువలె తనూ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా.. ఎక్కడెక్కడ పర్యటించినా వరంగల్‌తోనే బంధం పెనవేసుకుపోయింది. తను ఎదిగిన, తన ఎదుగుదలకు కారణమైన వరంగల్‌ను తుదిశ్వాస వరకు ఆయన విడిచిపెట్టలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here