మిక్చర్ పొట్లం గీతాలు

0
29

జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న మిక్చర్ పొట్లం చిత్ర గీతాలు  విడుదలయ్యాయి. ఎం.వి.సతీష్‌కుమార్ దర్శకుడు. లయన్ కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవపెద్ది సురేష్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను నటుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ విడుదల చేశారు. చిత్ర ప్రచార చిత్రాన్ని ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్,పి. బాలసుబ్రమణ్యం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ నేను ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజమండ్రికి చెందిన అభిరుచిగల ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాతో నిర్మాతలుగా మారుతున్నందుకు ఆనందంగా వుంది.

దర్శకుడు సతీష్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని నమ్ముతున్నాను. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. బాలు పాటలు పాడడం, మాదవపెద్ది సురేష్ సంగీతం అందించడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు అన్నారు. అలాగే రాష్ట్ర విభజన కారణంగా 2012లో నంది అవార్డులు అందించలేకపోయాం. త్వరలోనే అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో మరో పేరుతో పురస్కారాలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.ఈ అవార్డుల ప్రదానం త్వరలోనే ఉంటుందిఅన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నిత్య జీవితంలో మనకు ఎదురుపడే పాత్రలు ఎలా వుంటాయో మా చిత్రంలోనే అలాగే వుంటాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారనే నమ్మకముంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవపెద్ది సురేష్‌చంద్ర, భానుచందర్, జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here