మా నమ్మకం నిజమైంది!

0
19

దేశవ్యాప్తంగా 500, 1000 నోట్లు రద్దు కావడంతో జనాలు ఇబ్బందుల్లో వున్నారు. ఈ దశలో మా చిత్రాన్ని నిర్మాతలు ఎలా విడుదల చేస్తారా? అని భయపడ్డాను. అయితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నిర్మాత ధైర్యం చేసి విడుదల చేశారు. సినిమా అనూహ్య విజయాన్ని సాధించడంతో మా నమ్మకం నిజమైంది అన్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. నందితా శ్వేత, అవికా గోర్, హెభాపటేల్ కథానాయికలు. పి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

LEAVE A REPLY