మా ఛాంపియన్లను అలా అనకండి

0
19

కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌.. ప్రముఖ బాలీవుడ్‌ పాటల రచయిత జావెద్‌ అక్తర్‌పై మండిపడ్డారు. కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌కౌర్‌ సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌లపై రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ చేసిన కామెంట్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై జావెద్‌ అక్తర్‌ స్పందిస్తూ ‘యుద్ధాన్ని, హింసను వ్యతిరేకిస్తున్న ఓ అమరవీరుడి కుమార్తెను సరిగ్గా చదువుకోని ఓ రెజ్లర్‌ తప్పుబట్టాడంటే ఓ అర్థముంది. కానీ చదువుకున్న వారికి ఏమైంది’ అంటూ యోగేశ్వర్‌పై పరోక్షంగా కామెంట్‌ చేశారు.

దాంతో ఓ సెలబ్రిటీ అయివుండి భారత్‌ ఛాంపియన్‌ని పట్టుకుని అలా కామెంట్‌ చేయడం క్రీడాశాఖ మంత్రిగా విజయ్‌ గోయల్‌కి నచ్చలేదు. ‘సమాజంలో పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్న వారు ఇలా మన భారతీయ క్రీడాకారులను అవమానపరుస్తూ మాట్లాడడం సబబు కాదు. ఇంకెప్పుడూ మా క్రీడాకారులను చదువులేనివారు అనకండి. మీ రంగంలో మీరు ఛాంపియన్లు. అలాగే వారూ వారి రంగాల్లో ఛాంపియన్స్‌. అందుకు భారత్‌ వారిని చూసి గర్విపడుతోంది’ అంటూ ట్వీట్‌తో జావేద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు గోయల్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here