‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా

0
24
Sivaji Raja @ Rajendra Prasad Press Meet about MAA Elections 2015

గత ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశాం. ఈ మధ్యే దాసరి నారాయణరావుగారిని కలిసి మా కార్యక్రమాల గురించి తెలియజేశాం. ప్రస్తుత కమిటీ బాగా పనిచేస్తోందని, ఈ దఫా ఎలాంటి పోటీ లేకుండా కొత్త కమిటీ ఎన్నికకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అన్నారు మా జాయింట్ సెక్రటరీ నరేష్. ప్రస్తుత మా కమిటీ రెండేళ్ల గడువు ముగియడంతో హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో మంగళవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కొత్త కమిటీ అధ్యక్షుడిగా శివాజీరాజా పేరును మా కమిటీ, ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీనికి మా సభ్యులు, సలహాదారులు అంగీకరించారు. మా జనరల్ సెక్రటరీగా నా పేరును కూడా ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అన్నారు. మా జనరల్ సెక్రటరీ శివాజీరాజా మాట్లాడుతూ ఎన్నికల్లో మేము 10శాతం హామీలిచ్చాం. కానీ కళాకారుల శ్రేయస్సు కోసం 100శాతం కృషి చేశాం. ఇది మా సభ్యుల సహకారంతో సాధ్యమైంది. ఏదైనా ఆపద వస్తే మా వుందనే ధైర్యంతో కళాకారులందరూ బ్రతకాలి అన్నారు . ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, ఈసీ మెంబర్లు గీతాంజలి, ఏడిద శ్రీరాం, గౌతమ్‌రాజు, హరనాథ్ బాబు, హేమ, జయలక్ష్మి, మానిక్, నర్సింగ్ యాదవ్, సురేష్ కొండేటి, పి.శ్రీనివాసులు, శ్రీశశాంక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY