మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడింది!

0
43

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన కంచెలో సీతాదేవిగా రాయల్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించాను. ఓం నమో వేంకటేశాయలో భవాని పాత్రలో ఆకట్టుకున్నాను. అయితే గుంటూరోడు లవ్‌లోపడ్డాడులో మాత్రం నా నిజజీవితానికి దగ్గరగా వుండే పాత్రలో కనిపిస్తాను అన్నారు ప్రగ్యాజైస్వాల్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం గుంటూరోడు లవ్‌లోపడ్డాడు. మంచు మనోజ్ కథానాయకుడు. ఎస్.కె.సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయిక ప్రగ్యాజైస్వాల్ మాట్లాడుతూ గతంలో నేను చేసినవి పక్కా క్లాస్ చిత్రాలు. వాటికి పూర్తి భిన్నంగా రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో నా పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది. చిత్రంలో నా పాత్ర పేరు అమృత. స్వతంత్ర భావాలు గల అమ్మాయి. అలాంటి అమ్మాయి ఓ యువకుడి ప్రేమలోపడితే ఏం జరిగింది అనేది ఆసక్తిని పంచుతుంది. మనోజ్‌తో తొలిసారి కలిసి నటించాను. మా ఇద్దరి మధ్య సాగే ప్రేమకథ కొత్తగా వుంటుంది. మనోజ్‌పై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు, సెంటిమెంట్ సీన్స్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.

కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న నక్షత్రం నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. కృష్ణవంశీ పంథాలో వుంటూనే ైస్టెలిష్ పోలీస్‌గా ఆకట్టుకుంటాను. ఈ చిత్రంలో నాతో కృష్ణవంశీ ఫైట్‌లు చేయించారు. చిన్నతనంలో మా అమ్మ నాకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించింది. అది నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఊహించలేదు. దూరదృష్టితో అమ్మ నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి పనికొచ్చాయి. గత ఆరు నెలలుగా వరుస షూటింగ్‌లతో హైదరాబాద్‌లోనే వుంటున్నాను. ఇక్కడి వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వాతావరణం, హైదరాబాదీ బిర్యానీ అన్నా నాకు ఎంతో ఇష్టం అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here