మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు

0
24

తెలుగు రాష్ర్టాల్లో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగనున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలతోపాటు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29 తో ముగుస్తున్నది. తెలంగాణలో ఉపాధ్యాయ కోటాలో ఒకటి, స్థానికసంస్థల కోటాలో మరొకటి, ఎమ్మెల్యేల కోటాలో మూడు, గవర్నర్ కోటా (నామినేటెడ్)లో రెండు స్థానాల పదవీకాలం ముగుస్తుండగా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఉపాధ్యాయ కోటాకు మాత్రం సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. మిగిలిన కోటాల్లో జరుగాల్సిన ఎన్నికలకు త్వరలో షెడ్యూలు విడుదలవ్వాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలుండగా టీఆర్‌ఎస్‌కు 30 మంది సభ్యులున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ స్థానం నుంచి కాటిపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది.

LEAVE A REPLY