మార్చి 11 తర్వాత కొత్త పార్టీ

0
26

సమాజ్‌వాదీ పార్టీలో ముగిసిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుంది. ఎస్పీ సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్‌యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే మార్చి 11 తర్వాత కొత్త పార్టీ పెడుతానని ప్రకటించారు. ఎస్పీకాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహంగా ఉన్న శివపాల్.. తన అన్న కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ యూపీలో మళ్లీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాడో చూస్తానని హెచ్చరికలు జారీ చేశారు. జశ్వంత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన మంగళవారం ఎటావాలో ఎస్పీ అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రసంగించారు.

LEAVE A REPLY