మార్చి నాటికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ

0
20

 దశాబ్దాలుగా రెవెన్యూ పరంగా అపరిష్కృతంగా ఉన్న ‘చుక్కల భూముల (డాట్‌ ల్యాండ్స్‌)’ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ భూములు ఎవరి సాగులో ఉన్నాయో, వారికి వాటిపై హక్కులు కల్పిస్తామన్నారు. మంగళవారం ఇక్కడ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో నిర్వహించిన కార్యశాలలో ఆయన పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. అందులో…రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల్ని గుర్తించి జనవరిలో పేదలకు పట్టాలు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారికి ఇటీవల విశాఖపట్నంలో క్రమబద్ధీకరించినట్లుగా… పట్టాలిచ్చే ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేస్తారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌, జూన్‌ నెలాఖరుకి ప్రతి కుటుంబానికి వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తారు.

LEAVE A REPLY