మార్కెట్‌యార్డులో గ్రేడింగ్‌ యంత్రం

0
22
పండ్లతోటల రైతులకు కొంతలో కొంత ఉపయోగపడేలా గ్రేడింగ్‌ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. పండ్లతోటల సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో పదేళ్ల కిందటే రూ.25 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన గ్రేడింగ్‌ యంత్రాన్ని ఇప్పుడిపుడే వినియోగంలోకి తెచ్చారు.
రైతులకు అదనపు ఆదాయం కల్పించే క్రమంలో సంఘం సభ్యులు ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాసచౌదరి మూలనబడిన మిషన్‌కు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఈ తరహా గ్రేడింగ్‌ విధానం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. రైతులు పండించిన చీనీకాయలకు అదనంగా ధర పలకాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన రైపనింగ్‌ ఛాంబర్‌లో ఇథలీన్‌ గ్యాస్‌ ద్వారా రంగు మెరుగుపరచుకోవాలన్నారు. అలాగే సైజుల వారీగా వ్యాక్సీ గ్రేడింగ్‌ చేసుకుంటే తప్పనిసరిగా టన్నుపై రూ.5 వేల వరకు అదనంగా తీసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియలో రైతులు టన్నుకు రూ.1,250, లోడింగ్‌ అన్‌లోడింగ్‌కు మరో రూ.250 ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కువగా చీనీకాయలు పండించే రైతులకు పెద్ద లాభం వస్తుందన్నారు. పంట పండించడానికి ఎంతైనా కష్టపడే రైతులు దిగుబడిని మార్కెటింగ్‌ చేసుకోవడంలో అనాసక్తి ప్రదర్శించడం వల్ల నష్టాలు వస్తున్నాయన్నారు.

LEAVE A REPLY