మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా నటులు

0
37

మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా నటులు చిరంజీవి, నాగబాబు తమ తల్లి అంజనాదేవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వీరు తమ ఇద్దరు సోదరీమణులతో కలిసి అమ్మకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు చెప్పారు. పవన్‌కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉండటం వల్ల ఈ వేడుకలో పాల్గొనలేకపోయారు.
పవన్‌ ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి ఆయన అలిపిరి కాలినడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. మరో రెండు రోజులు ఆయన తిరుమలలోనే ఉండబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here