మాంజాలపై నిషేధం

0
13

మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దేశవ్యాప్తంగా నిషేధించింది. హానికరమైన మాంజాను వినియోగించవద్దని బుధవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పతంగులు ఎగురవేయడానికి గాజుముక్కలు, ఖనిజపొడితో తయారుచేసిన మాంజాను వినియోగించడం వల్ల ప్రకృతికి తీవ్ర విఘాతం కలుగుతున్నదని ఎన్జీటీ చైర్‌పర్సన్ స్వాతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నైలాన్, చైనీస్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. గాలిపటాలను ఎగురవేసే దారాలవల్ల కలిగే చెడు ప్రభావాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిక సమర్పించాలని భారత మాంజా అసోసియేషన్‌కు ఎన్జీటీ సూచించింది.

LEAVE A REPLY