మహేష్ మూవీకి టైటిల్

0
33

బ్రహ్మోత్సవం మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత స్పీడ్ పెంచాడు. మురుగదాస్ మూవీ చేస్తూనే ఇటు కొరటాల శివ, అటు వంశీ పైడిపల్లి సినిమాలకు సంబంధించి పనులను వేగవంతం చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అహ్మదాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత కొరటాలతో కలిసి ఓ మూవీ చేయనున్నాడు మహేష్. గత నెలలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో మహేష్ సరసన కొత్త భామని కథానాయికగా సెలక్ట్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి భరత్ అనే నేను టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here