మహేష్‌బాబు కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ‘సంభవామి’

0
28

మహేష్‌బాబు కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. మహేష్‌బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రానికి వాస్కోడిగామా, చట్టంతో పోరాటం, ఏజెంట్ శివ వంటి పలు టైటిల్స్ ప్రచారంలో వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here