మహేశ్‌భట్‌కు బెదిరింపు కాల్, ఒకరి అరెస్టు

0
11

డబ్బు డిమాండ్‌చేస్తూ సినీ నిర్మాత,దర్శకుడు మహేశ్‌భట్‌ను ఫోన్లో బెదిరించిన ఘటనలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. మహేశ్‌భట్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు ఫోన్లుచేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే ఆయన కుమార్తె నటి అలియాభట్‌కు కూడా హాని చేస్తామని బెదిరించాడు. వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపా డు. దీనిపై మహేశ్‌భట్ జుహు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై ముంబై క్రైం బ్రాంచి పోలీసులు విచారణ చేపట్టినట్టు డీసీపీ వినయ్ రాథోడ్ తెలిపారు.

LEAVE A REPLY