మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: కేటీఆర్‌

0
17

‘‘తెలంగాణలో ఆడబిడ్డలకు మేనమామ అండగా ఉంటారు. అదే పాత్రను ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పోషిస్తున్నారు. పేదల బతుకు తెలిసిన సీఎం కనక మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లు పెట్టారు. కడుపుతో ఉన్న ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దనే అమ్మఒడి పథకాన్ని పెట్టారు. ఈ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ‘కేసీఆర్‌ కిట్‌’ పేరుతో 13 రకాల వస్తువులు అందిస్తున్నారు’’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎలా పని చేశారో సీఎంగానూ అదే రీతిలో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మందికి పెద్ద మొత్తంలో పెన్షన్‌ ఇస్తున్న ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో గురువారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని దరిద్రాలకు, సమస్యలకు కాంగ్రెసే కారణమన్నారు. టీడీపీకి పట్టించిన గతే ఆ పార్టీకి పట్టించాలని పిలుపునిచ్చారు. రుణమాఫీలో యూపీకి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

LEAVE A REPLY