మహిళా శక్తి కళా ప్రదర్శన

0
24

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలోని భిన్న కోణాలను, తమ వ్యక్తిగత గాథలను పది మంది మహిళా కళాకారులు కాన్వాస్‌పై చిత్రించారు. ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ ప్రాంగణంలో తస్వీర్-ఎక్స్‌ప్లోరింగ్ ది కలర్స్ ఆఫ్ ఉమెన్‌హుడ్ పేరుతో ఓ ప్రదర్శనను నిర్వహించారు. ఇక్కడ కళాకారులు స్త్రీని ప్రేమ, అభిరుచి, అందానికి ప్రతిబింబంగా చిత్రీకరించారు. ఆమెలో జీవించి ఉన్న అద్భుత శక్తులను వివిధ రూపాల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మహిళలు శక్తివంతులు, విశ్వరక్షకులు అనే విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఈ ప్రదర్శన మనకు తోడ్పడుతుంది. ప్రశాంతమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడం ఆమె వల్లే సాధ్యం అని ప్రదర్శన నిర్వాహకుడు కుమార్ వికాస్ సక్సేనా తెలిపారు. మహిళా సాధికారతకు కృషిచేసే పలు సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here