మహిళా యాంకర్‌పై పోలీసు జులుం

0
20
గ్రామ దేవత ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేస్తున్న ఓ మహిళా యాంకర్‌పై సీఐ చేయి చేసుకున్నాడు. ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగనంపూడిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి. బొర్రమాంబ పుట్టబంగారు మహోత్సవంలో భాగంగా నిర్వాహకులు స్థానిక కూడలిలో డ్యాన్స్‌బేబీ డ్యాన్స్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మహిళా యాంకర్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమ ప్రారంభంలో యాంకర్‌ డ్యాన్స్‌ చేస్తుండగా దువ్వాడ సీఐ సాయి అక్కడకు చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే ఆమెను కొట్టి వేదిక కిందకు దించారు. అక్కడి నుంచి జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో సైతం అమెను కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయినట్టు సమాచారం.
 దీంతో సీఐ వెంటనే యాంకర్‌ను అక్కడ నుంచి వైద్యం నిమిత్తం స్థానిక కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే మహిళా యాంకర్‌పై సీఐ చేయి చేసుకోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. యాంకర్‌ అశ్లీల నృత్యం చేయలేదని, ఆమె తప్పు చేస్తే మందలించాలే గాని కొట్టే అధికారం సీఐకు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఇదిలావుంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా యాంకర్‌ వద్దకు ఎవ్వరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here